ఉరవకొండ: ప్రసిద్ధిగాంచిన ఉరవకొండ గవి మఠ సంస్థానం పీఠాధిపతి పీఠంపై నెలకొన్న వివా దం గురువారం దేవదా య, ధర్మదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. గవిమఠం ఎనిమిదో పీఠాధిపతిగా కొనసాగిన చెన్నబసవ రాజేంద్రమహస్వామి ఈ ఏడాది జూలై 18న శివైక్యం పొందారు. పీఠాధిపతుల వారసత్వ హక్కుల విషయంలో ప్రస్తుత గవిమఠ ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, ఆదోని చోకి మఠం పీఠాధిపతులు కల్యాణస్వామిజీ మధ్య వివాదం తలెత్తింది. దీంతో కర్నూలు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు ఇద్దరు స్వామీజీల వాదనలు విన్నారు. ఈవిచారణలో గవిమఠం అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి పాల్గొన్నారు.


