మైక్రో అబ్జర్వర్లదే కీలకపాత్ర | - | Sakshi
Sakshi News home page

మైక్రో అబ్జర్వర్లదే కీలకపాత్ర

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

అనంతపురం న్యూటౌన్‌: పరిషత్‌ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లదే కీలక పాత్ర అని మాస్టర్‌ ట్రైనర్‌ గోవిందరాజులు, నోడల్‌ అధికారి మారుతి శ్రీనివాసులు (ఎల్‌డీఓ) స్పష్టం చేశారు. గురువారం జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని డీపీఆర్‌సీలో మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్‌ ట్రైనర్‌, నోడల్‌ అధికారి మాట్లాడుతూ పోలింగ్‌ రోజున నిబంధనలను కచ్చితంగా అమలు చేయించే బాధ్యత మైక్రో అబ్జర్వర్లదేనన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ల ద్వారా జరగనున్న ఎన్నికల ప్రక్రియపై ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే రిటర్నింగ్‌ అధికారులను సంప్రదించి, నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, నోడల్‌ అధికారులు, వివిధ ప్రాంతాలకు చెందిన మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.

1,040 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల నమోదు

అనంతపురం అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికల విధులకు నియమించిన అధికారులు, ఉద్యోగుల్లో 1,040 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 39 సర్వీస్‌ ఓటర్ల ఓట్లు నమోదైనట్లు అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ జశ్వంత్‌రావు గురువారం తెలిపారు.

యువతి ఆత్మహత్యాయత్నం

పావగడ: పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి యువతి గురువారం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వివరాలు.. పావగడ తాలూకా దొడ్డేనహళ్లికి చెందిన గణేశ్‌, కుందుర్పి మండలం కరిగానపల్లికి చెందిన సింధు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే గణేశ్‌ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా, వారు పట్టించుకోలే దు. మనస్తాపం చెందిన ఆమె.. బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యయత్నం చేసింది. పోలీసులు, అగ్ని మాపకదళ సిబ్బంది కాపాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement