రైలు ఢీకొని ఎలుగుబంట్ల మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని ఎలుగుబంట్ల మృత్యువాత

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

డి.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): డి.హీరేహాళ్‌ మండల పరిధిలోని కల్యం గ్రామ సమీపంలో రైలు ఢీకొని రెండు ఎలుగుబంట్లు మృత్యువాతపడ్డాయి. ఈవిషయాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమచారం అందించారు. రాయదుర్గం ఫారెస్ట్‌ డిప్యూటీ రెంజ్‌ ఆఫీస్‌ దామోదర్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. రాత్రి వేళలో ఎలుగుబంట్లు రైల్వే ట్రాక్‌ దాటుతున్న సమయంలో రైలు ఢీకొని ఉంటుందని ఆయన తెలిపారు.

ఏపీ హెచ్‌ఈఆర్‌ఎంసీ మెంబర్‌ సెక్రటరీగా కృష్ణయ్య

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫీజు రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఏపీ హెచ్‌ఈఆర్‌ఎంసీ) మెంబర్‌ సెక్రటరీ కమ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా ప్రొఫెసర్‌ ఎస్‌.కృష్ణయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జె.శ్యామలరావు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఉన్నత విద్యలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.

రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న ఎలుగుబంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement