ఎస్టీ గురుకులం ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

ఎస్టీ గురుకులం ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్‌ వేటు

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం.ప్రవీణ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రిన్సిపాల్‌ పాఠశాలలోని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో మసాజ్‌ చేయించుకుంటున్నారన్న నేపథ్యంలో ‘సాక్షి’లో ఈనెల 25న ‘వేధింపుల్లో ప్రవీణుడు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై విచారణ జరిపిన ఏపీటీడబ్ల్యూఆర్‌ఈ సొసైటీ కార్యదర్శి ఐఏఎస్‌ ఎం.గౌతమి గురుకుల ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అమిలినేని ప్రసన్నం కోసం నానాతిప్పలు :

సస్పెండ్‌ ఉత్తర్వులు రాగానే గిరిజన సంఘం నేతలతో కలిసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వద్దకు వెళ్లి ప్రసన్నం చేసుకునేందుకు ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌కుమార్‌ నానా తిప్పలు పడ్డారు.

వైస్‌ ప్రిన్సిపాల్‌కు బాధ్యతలు అప్పగింత ..

ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయడంతో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా అదే పాఠశాలలో పనిచేస్తున్న వైస్‌ ప్రిన్సిపాల్‌ (తెలుగు టీజీటీ) ఎంఎన్‌. బ్రహ్మానందయ్యకు బాధ్యతలు అప్పగించాలని గురుకుల కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement