కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో టీడీపీ మూకలు రాజకీయ కక్ష సాధింపులకు బరితెగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలే మనోధైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా వికృత చేష్టలకు ఒడిగడుతున్నారు. కళ్యాణదుర్గం మండలం కొండాపురానికి చెందిన ఆంజినేయులు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. దీన్ని ఓర్వలేని టీడీపీ నేతలు అతడిని భయభ్రాంతులకు గురిచేసే కుట్రకు తెరలేపారు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి దుండగులు ఆంజినేయులు ఇంటి ముందు నిలిపిన బైకుకు నిప్పు పెట్టారు. మంటలను గమనించిన ఆంజినేయులు కుటుంబ సభ్యులు మంటలను ఆర్పేశారు. అనంతరం ఘటనపై బాధితుడు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు
స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తెలిసే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు తెర లేపారని తలారి రంగయ్య పేర్కొన్నారు. ఇలాంటి వికృత చేష్టలకు భయపడే ప్రసక్తే లేదని, చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.


