రెండు రోజులుగా నాన్చుడే | - | Sakshi
Sakshi News home page

రెండు రోజులుగా నాన్చుడే

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

విడపనకల్లు: స్క్రూటినీలో తిరస్కరణకు గురైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల అప్పీళ్ల విచారణపై అధికారులు రెండు రోజులుగా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. మండలంలోని హావళిగి–2, వి.కొత్తకోట ఎంపీటీసీ స్థానాలు జనరల్‌ మహిళకు రిజర్వు అయ్యాయి. ఈ స్థానాలకు వైఎస్సార్‌సీపీ తరఫున శింగాల చంద్రకళ, శివలింగమ్మ, కళావతి నామినేషన్లు వేశారు. పరిశీలన సమయంలో వీరి నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. దీంతో అభ్యర్థులు గుంతకల్లు ఆర్డీఓకు అప్పీలు చేసుకున్నారు. రెండు రోజులుగా ఆర్డీఓ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారుల నుంచి ఎటువంటి స్పందనా లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement