రాయదుర్గంటౌన్: కణేకల్లు మండలంలోని ఎర్రగుంట–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వేసిన నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అసంబద్ధంగా సాగిందన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. రెండు పేపర్లలో ఎర్రగుంట–1 అని రాసినా.. మూడో పేజీ డిక్లరేషన్‌లో స్థానం పేరు రాయకపోవడాన్ని సాకుగా చూపి నామినేషన్‌ను తిరస్కరించడం ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కడమే అని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ లీగల్ సెల్ అడ్వొకేట్ వెంకటరెడ్డితో కలిసి ఆర్డీఓకు అప్పీల్ చేశారు. ఎర్రగుంట–2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్‌లో డిక్లరేషన్‌లో స్థానం పేరు రాకపోయినా ఆమోదం తెలపడం దేనికి సంకేతమో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కణేకల్లు జెడ్పీటీసీ అభ్యర్థి కేశవరెడ్డి, రాయదుర్గం మండల కన్వీనర్ రామాంజనేయులు పాల్గొన్నారు.
ఏకపక్ష నిర్ణయంతో ఎర్రగుంట–1
ఎంపీటీసీ నామినేషన్ తిరస్కరణ
ఎన్నికల అధికారి తీరుపై
ఆర్డీఓకు అప్పీలు


