రెండు చోట్ల ఓటున్నా .. నామినేషన్‌ ఆమోదమా? | - | Sakshi
Sakshi News home page

రెండు చోట్ల ఓటున్నా .. నామినేషన్‌ ఆమోదమా?

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

నార్పల: ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ వారి పట్ల ఒకలా.. ఇతర పార్టీల వారిపట్ల మరొకలా నడుచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. నిబంధనల్లో ఏ ఒక్కటి సరిగా లేకున్నా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్న అధికారులు.. టీడీపీ తరఫున చిత్రచేడు విశాలాక్షి వేసిన నామినేషన్‌ పరిశీలనలో అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. విశాలాక్షికి అనంతపురం అర్బన్‌లోని ఏడో వార్డులో ఒక ఓటు, గార్లదిన్నె మండలం కోటంక పంచాయతీలో మరొక ఓటు ఉంది. అయినా ఆమె నార్పల జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ తరఫున నామినేషన్‌ వేశారు. పరిశీలనలో రెండు ఓట్లు ఉన్న విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా నామినేషన్‌ను ఆమోదించారు. అధికార పార్టీ వారు అయితే నిబంధనలు వర్తించవా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement