అధికారుల అలసత్వం.. ప్రజలకు ప్రాణ సంకటం | - | Sakshi
Sakshi News home page

అధికారుల అలసత్వం.. ప్రజలకు ప్రాణ సంకటం

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

గుంతకల్లు: ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ అధికారుల తీవ్ర ఉదాసీనత కారణంగా అన్యాయంగా అయాయకుల ప్రాణాల గాల్లో కలిసిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఒక వ్యక్తి మృతి, ఒక అమ్మాయి అంగవైకల్యం జరగగా ఇప్పుడు మరో వ్యక్తి ప్రాణాపాయంతో ఆస్పత్రిలో కొట్టుమిట్డాడుతున్నాడు. వివరాలు.. ఆదివారం గుంతకల్లు పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్‌ వద్ద రోడ్డు దాటుతున్న ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి సుందరయ్య మీదుగా ఒక లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుడికాలు, కుడి చేయి ఛిద్రమయ్యాయి. వెంటనే ఆయనను గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రాధమిక చిక్సిత చేసి అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి రెఫర్‌ చేశారు. ప్రసుత్తం సుందరయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదే నెల 6న ఆ ప్రదేశంలో భవన నిర్మాణ కార్మికుడు నగేష్‌ రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అలాగే గత నెలలో జోహా అనే బాలిక రోడ్డు ప్రమాదానికి గురై శాశ్వత దివ్యాంగురాలైందిది. బాలికతోపాటు తండ్రి రియాజ్‌ బాషా కూడ గాయపడిన విషయం తెలిసిందే.

అధికారుల నిర్లక్ష్యం..

రోడ్డు ప్రమాదాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ అధికారుల తీవ్ర ఉదాసీనతే కారణం. వాస్తవానికి లారీలు, ట్రక్కులు వంటి భారీ వాహనాలు పట్టణలో ప్రవేశించకుండా పాత గుంతకల్లు మీదుగా వెళ్తుంటాయి. అయితే పాత గుంతకల్లులో రోడ్డుపక్కన పైప్‌లైన్‌లతోపాటు రోడ్డు మరమ్మతులు చేపట్టారు. దీంతో పాత గుంతకల్లు మీదుగా వెళుతున్న రోడ్డును మున్సిపల్‌ అదికారులు బ్లాక్‌ చేసి భారీ వాహనాలను పట్టణం గుండా వెళ్లేందుకు అనుమతించారు. అసలే ఇరుకై న గుంతకల్లు ప్రధాన రోడ్డులో ట్రాఫిక్‌ చాలా ఉంటుంది. దీనికి తోడు రోజూ వేలాది భారీగా వాహనాలు పట్టణం గుండా రేయింబవళ్లు రాకపోకలు సాగిస్తుడటంతో విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుంది. ఫలితంగా నెల రోజుల వ్యవధిలోనే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అధికారులు స్పందించి పనులు వేగవంతం చేయించి, పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా చేయాలని ప్రజలు కోరారు.

ఒకే చోట తరచూ రోడ్డు ప్రమాదాలు చావుబతుకుల మధ్య ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement