రెండోరోజు నామినేషన్ల హోరు | - | Sakshi
Sakshi News home page

రెండోరోజు నామినేషన్ల హోరు

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

● గుంతకల్లులో పోటాపోటీగా 156 నామినేషన్లు

● అనంతపురంలో కొనసాగుతున్న నామినేషన్లు ప్రక్రియ

అనంతపురంలో నామినేషన్లు వేయడానికి వెళుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు హస్తవాసి బాగుంటుందని బాలుడి చేతిలో నామినేషన్‌ పత్రాలు చిన్నారితో నామినేషన్‌ కేంద్రానికి వస్తున్న మహిళ

అనంతపురం: జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్‌) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు శనివారం జోరుగా సాగింది. వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడానికి భారీగా తరలివచ్చారు. ప్రధానంగా కూటమి పార్టీలతో పాటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ల దాఖలు ముమ్మరం చేశారు.

● గుంతకల్లు మున్సిపాలిటీలో పోటాపోటీ వాతావరణం నెలకొంది. రెండో రోజు 156 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో చైర్‌పర్సన్‌ పదవికి టీడీపీ తరఫున ఒక నామినేషన్‌ దాఖలైంది. కౌన్సిలర్‌ స్థానాలకు మొత్తం 155 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో టీడీపీ తరఫున 68, వైఎస్సార్‌సీపీ 66, జనసేన 3, సీపీఐ 1, బీజేపీ 1, బీఎస్పీ 1, కాంగ్రెస్‌ 1, స్వతంత్రులు (ఇండిపెండెంట్లు) 14 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

● గుత్తి మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మధ్య ఉత్సాహం నెలకొంది. మున్సిపల్‌ కమిషనర్‌/ఎన్నికల అధికారి సురేంద్ర సమక్షంలో శనివారం మొత్తం 41 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్‌ స్థానానికి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక కౌన్సిలర్‌ స్థానాలకు 39 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో టీడీపీ 30, వైఎస్సార్‌సీపీ 4, సీపీఎం 2, బీజేపీ 1, జనసేన 1, ఇండిపెండెంట్‌గా ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

● కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 32 వార్డులకు శనివారం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్థులు 12 చోట్ల, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 5 చోట్ల నామినేషన్లు వేశారు. ముహూర్తం బాగోలేకపోవడం వల్ల చైర్మన్‌ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ వేయలేదు.

● అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నామినేషన్ల సందడి క్రమంగా ఊపందుకుంది. 62 డివిజన్లు ఉన్న నగరపాలక సంస్థలో శనివారం మేయర్‌ స్థానానికి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. కార్పొరేటర్‌ స్థానాలకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టీడీపీకి సంబంధించి 12, వైఎస్సార్‌సీపీకి సంబంధించి 4 నామినేషన్లు ఉన్నాయి.

● రాయదుర్గంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానానికి రెండో రోజు శనివారం ఒక నామినేషన్‌ దాఖలు కాగా, కౌన్సిలర్‌ స్థానాలకు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీజేపీ 2, వైఎస్సార్‌సీపీ 40, కాంగ్రెస్‌ 2, టీడీపీ 47, సీపీఐ 1, జనసేన 4, ఏఐఎంఐఎం 2, ఇండిపెండెంట్లు –1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తున్న ఫయాజ్‌బాషా

కళ్యాణదుర్గంలో నామినేషన్‌ దాఖలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి దీప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement