● ‘అనంత’ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రమేష్ గౌడ్
అనంతపురం: మేయర్ అభ్యర్థిగా రమేష్గౌడ్ను ఖరారు చేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. పార్టీ కోసం క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసినందుకు తగిన గుర్తింపు దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ఆయన నివాసంలో రమేష్గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి, జిల్లా నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని నాయకులు, కార్యకర్తలు, విభాగాలు, ప్రజాసంఘాలు, వార్డు ఇన్చార్జ్లు అందరినీ సమన్వయం చేసుకుంటూ, కలసికట్టుగా గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా వసతులు, డ్రెయినేజీ వ్యవస్థ ఆధునీకరణ, తాగునీటి ఎద్దడి నివారణే ధ్యేయంగా పనిచేస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. యువకుడు, విద్యా వంతుడైన రమేష్గౌడ్కు అందరూ మద్దతిచ్చి భారీ మెజార్టీతో మేయర్గా గెలిపించాలని కోరారు.


