కూడేరు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని శివరాంపేటలో గోర్ల వెంకటేశులు, లక్ష్మిదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె మల్లేశ్వరి, కుమారుడు శ్రీకాంత్ సంతానం. డిగ్రీ పూర్తి చేసిన శ్రీకాంత్.. అప్పటి ప్రభుత్వంలో గ్రామ వలంటీర్‌గా నియమితులయ్యాడు. ఉత్తమ సేవలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి ఉన్నపళంగా అర్ధరాత్రి పొలంలో దారుణహత్యకు గురయ్యాడు. వ్యవసాయమే జీవనాధారమైన శ్రీకాంత్ తండ్రి వెంకటేశులుకు సుమారు ఆరు ఎకరాల పొలం ఉంది. అందులో రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశారు. పంట కాలం పూర్తవడంతో 2021 మార్చి 8న కూలీలతో తొలగించాడు. పంట దిగుబడిని అక్కడే ఒకచోటకు చేర్చాడు. రోజూ వెంకటేశులు కాపలా వెళ్లేవాడు. నాలుగు రోజుల తర్వాత (మార్చి 12న) ఇంటి వద్ద పనులున్నా శ్రీకాంత్ క్రికెట్ టోర్నమెంట్‌కు వెళ్లాడు. పనులు పెట్టుకుని క్రికెట్‌కు ఎందుకు వెళ్లావని తల్లిదండ్రులు మందలిస్తారని శ్రీకాంత్ లోలోన మదనపడుతూనే రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ‘పొలం వద్దనున్న నాన్నను ఇంటికి రమ్మను.. నేను కాపలాగా పోతాను’ అని అమ్మ లక్ష్మిదేవమ్మతో నాన్నకు ఫోన్ చేయించాడు. ఈ మేరకు ఆమె ఫోన్ చేయగా వెంకటేశులు ఇంటికి తిరిగొచ్చాడు. అదే ద్విచక్ర వాహనంపై శ్రీకాంత్ పొలం వద్దకు కాపలాగా వెళ్లాడు. అతని వెంట మరో ఇద్దరు యవకులూ వెళ్లినట్లు గ్రామస్తులు మాట్లాడుకున్నారు. 13న తెల్లవారుజామున పొరుగునే ఉన్న తోటలో నుంచి శ్రీకాంత్ చిన్నాన్న లోకేష్ అక్కడికెళ్లి మొబైల్‌కు కాల్ చేశాడు. మొబైల్ లైట్ వెలుగుతోంది గానీ శ్రీకాంత్ ఫోన్ తీయలేదు. అనుమానంతో దగ్గరకెళ్లి చూడగా అప్పటికే శ్రీకాంత్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే తండ్రి వెంకటేశులుకు సమాచారమందించాడు. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు ఉదయం ఐదు గంటల సమయంలో పరుగున అక్కడికి చేరుకొని శ్రీకాంత్‌ను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీకాంత్ వీపుపై గుణపంతో పొడిచినట్లు లోతైన గాయం, గొంతు నులిమిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో శ్రీకాంత్ హత్యకు గురైనట్లు నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం డాగ్ స్క్వాడ్‌తో గాలించారు.
అతనో గ్రామ సచివాలయ వలంటీర్.. గ్రామస్తులందరితోనూ కలుపుగోలుగా మెలిగే యువకుడు.. గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా.. వారి దగ్గరికెళ్లి నేనున్నాను అంటూ భరోసాగా నిలిచిన మనసున్నవాడు.. రోజూ ఉదయాన్నే ఊరంతా తిరుగుతూ అక్కా..బావా.. అమ్మా, అవ్వా, తాతా అంటూ చిన్నాపెద్దా అ
Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM
Advertisement


