శ్రీకాంత్ వలంటీర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. గ్రామంలో అతని వెంట ఎప్పుడూ ఐదారుగురు యువకులు ఉండేవాళ్లు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేశాడు. ఇది కొందరు టీడీపీ లీడర్లకు మింగుడు పడలేదు. ‘ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా మీ వాడు పని చేస్తున్నాడు.. వాడి అంతు చూస్తాం’ అని తల్లిదండ్రులను నేరుగానే బెదిరించారు. ఈ క్రమంలోనే పథకం ప్రకారం శ్రీకాంత్‌పై తొలుత ఓ మహిళ భర్తతో కూడేరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. పింఛన్ పంపిణీ సమయంలో చనువుగా ఉంటున్నాడని ఆరోపించారు. ఆ సమయంలో దాడి కూడా చేశారు. కొన్నాళ్లకు అతని హత్య జరిగింది. ‘ఒక్కగానొక్క కుమారుణ్ని దారుణంగా చంపేశారు. ఐదేళ్లు పూర్తయినా ఈ హత్య ఎవరు చేశారో పోలీసులు చెప్పడం లేదు. మేము తిరగని పోలీసుస్టేషన్ లేదు.. న్యాయం అడగని అధికారి అంటూ లేరు.. సీఐలు, డీఎస్పీలు, ఎస్పీలు మారుతున్నా మాకు న్యాయం జరగడంలేదు. పగవారికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. ఇప్పటికై నా ఎస్పీ సార్ స్పందించి మా కుమారుణ్ని హత్య చేసిన నిందితులను గుర్తించి శిక్షించాలి’ అంటూ శ్రీకాంత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
హత్యకు గురైన శ్రీకాంత్ (ఫైల్), తమకు జరిగిన అన్యాయంపై తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు


