హక్కుల సాధనకు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు ఉద్యమం

Sep 1 2026 3:24 AM | Updated on Sep 1 2026 3:24 AM

‘సర్‌’ డేటా

దుర్వినియోగం కాకూడదు

అనంతపురం అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌ –సర్‌) డేటా దుర్వినియోగం కాకూడదని జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకుడు జీసీ కిషోర్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాకు విచ్చేసిన ఆయన సర్‌పై సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్పరెన్స్‌ హాలులో కలెక్టర్‌ ఆనంద్‌తో కలిసి ఈఆర్‌ఓతో సమీక్షించారు. ‘సర్‌’లో ఏదేని సమస్య వస్తే కలెక్టర్‌, జేసీ, డీఆర్‌ఓతో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. డేటా రక్షణ బాధ్యత అధికారులపై ఉందన్నారు.

తప్పుల్లేని ఓటర్ల జాబితా లక్ష్యం

తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యంగా ఎస్‌ఐఆర్‌ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకుడు జీసీ కిషోర్‌కుమార్‌ స్పష్టం చేశారు. ‘సర్‌’పై ఆయన కలెక్టర్‌ ఆనంద్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ సమగ్ర ఓటర్ల జాబితా తయారీకి పార్టీల ప్రతినిధులు, బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

అనంతపురం అర్బన్‌: ప్రభుత్వ ఉద్యోగులు హక్కుల సాధనకు నడుం బిగించారు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. పీఆర్‌సీ కమిషన్‌ వేయాలని, ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు చెల్లించాలని, అరియర్లు ఇవ్వాలనే డిమాండ్లతో ‘సిద్ధం.. సిద్ధం.. ఉద్యమానికి సంసిద్ధం’ అంటూ ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ ఆర్‌.ఎన్‌.దివాకర్‌రావు ఆధ్వర్యంలో నాయకులు, ఉద్యోగులు ర్యాలీగా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌కు చేరుకుని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌కు ఉద్యమ నోటీసు అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండేళ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నందున ఉద్యమబాట పట్టామని వివరించారు. అనంతరం దివాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌కు ఉద్యోగుల ఎజెండా తప్ప మరెటువంటి ఎజెండా లేదని ప్రభుత్వ పెద్దలకు తెలియజేశామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన హక్కుల్ని అడిగితే... మీది రాజకీయ ఎజెండా... ఏదో కుట్ర కోణం... అతిపోకడలు అనే పదాలను మంత్రి ఉపయోగించడం ఉద్యోగవర్గాన్ని చాలా బాధించాయన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. ప్రభుత్వంలో భాగమే అనేది తెలుసుకుని భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నామన్నారు.

ఉద్యమ కార్యాచరణ ఇదే..

మొదటి దశ: సెప్టెంబరు 1న ‘సీఎం సార్‌... మా డబ్బులు మాకివ్వండి’ నినాదంతో సెల్‌ఫోన్‌ డీపీలు పెట్టుకుని నిరసన. 1 నుంచి 5 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు. 2 నుంచి 8వ తేదీ వరకు హ్యండ్‌ టూ హ్యాండ్‌ కార్యక్రమం ద్వారా కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వాముల్ని చేయడం. 3 నుంచి 5వ తేదీ వరకు భోజన విరామ సమయంలో నిరసనలు. 11వ తేదీన జిల్లా కేంద్రంలో కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చ.

ఉద్యమ రెండవ దశ: సెప్టెంబరు 15 నుంచి 26 వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు వర్క్‌ టూ రూల్‌ పాటించడం. 15 నుంచి 22వ తేదీ వరకు సామాజిక మాధ్యమాల్లో డీపీలు, ఫొటోలు, రీల్స్‌ ద్వారా ప్రచారం. 15 నుంచి 25 వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల సమర్పణ. 17న నల్ల కండువాలతో నిరసన.. ‘సీఎం సార్‌... మా డబ్బులు మాకివ్వండి’ నినాదంతో మానవహారంగా ఏర్పడటం. 23న కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు, 26న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ‘మా డబ్బులు మాకివ్వండి’ నినాదంతో ధర్నాలు. అప్పటికీ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే మూడో దశ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్‌ ఖాన్‌, అసోసియేట్‌ చైర్మన్‌ మల్లరాయుడు, కోశాధికారి సంతోష్‌గౌడ్‌, మహిళా విభాగం చైర్‌పర్సన్‌ సురేఖరావు, ప్రధాన కార్యదర్శి నాగమణి, జిల్లా ఇన్‌చార్జ్‌ శివానందరెడ్డి, తోట చెన్నప్ప, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్‌, కోశాధికారి పునీత్‌బాబు, నాయకుల శ్రీనివాసయూర్తి, విలేజ్‌ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్‌, వీఆర్‌ఏ సంఘం అధ్యక్షుడు ఓబులేసు, కార్యదర్శి నాగరాజు, గ్రామవార్డు సచివాలయు సంఘం నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

పీఆర్‌సీ కమిషన్‌, ఐఆర్‌, డీఏల కోసం డిమాండ్‌

జేసీకి ఉద్యమ నోటీసు అందజేసిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ దివాకర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement