కుందుర్పి: అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, రక్షణకు ప్రతీక రాఖీ. అయితే అప్పిలేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థినులు ఒక వినూత్న ఆలోచనతో రాఖీ పండుగ చేసుకున్నారు. మనకు నిత్యం ప్రాణవాయువును అందిస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్న మొక్కలకు రాఖీలు కట్టి.. వాటిని రక్షించాలనే సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. తొలుత పాఠశాల ఆవరణలోని ఉసిరి, మామిడి, టేకు, మేడి, వెలగ, చింత, వక్క,సగురు వంటి మొక్కలను సోదరులుగా భావించి కుంకుమ బొట్లు పెట్టి, నీరుపోసి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో హెచ్‌ఎం హనుమంత రాయుడు, ఉపాధ్యాయులు బొమ్మయ్య, నాగేశ్వరి,సురేష్, లోకేష్, రాజు తదితరులు ఉన్నారు.
●రాఖీ శుభాకాంక్షలు
అనంతపురం అర్బన్: కలెక్టర్ ఆనంద్ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ఆయన్ను చాంబర్‌లో బ్రహ్మకుమారీలు, దివ్యాంగురాళ్లు కలిసి రాఖీలు కట్టి మిఠాయి తినిపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.


