●రైతుల కన్నీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

●రైతుల కన్నీటి కష్టాలు

Aug 29 2026 1:16 AM | Updated on Aug 29 2026 1:16 AM

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీర్ఘకాలికంగా ఫలసాయాన్ని అందించే పండ్లతోటలు సైతం ప్రమాదంలో పడ్డాయి. దీంతో రైతులు వాటిని కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. పెద్దవడుగూరు మండలం కాశేపల్లికి చెందిన రైతులు వెంకటరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి ఇటీవల 300 మామిడి మొక్కలు నాటారు. అవి ఎండిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో ట్యాంకర్లతో నీటిని తెప్పించి.. కూలీలను పెట్టుకుని బిందెలతో వాటికి పోయిస్తున్నారు. పంటలకు రక్షక తడులు అందించడానికి ప్రభుత్వం సాయం చేయాలని రైతులు కోరుతున్నారు. – పెద్దవడుగూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement