ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం

Aug 28 2026 2:27 AM | Updated on Aug 28 2026 2:27 AM

ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా నీటిని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి తరలించేందుకు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారే తప్ప ఇక్కడి రైతులకు కనీసం ఆరు తడి పంటలకై నా నీరివ్వాలన్న ఆలోచన చేయకపోవడం దుర్మార్గం. జిల్లాలో లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. తుంగభద్ర జలాశయం నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాలకు 21 టీఎంసీల నికర జలాలు కర్ణాటక ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నా 16 టీఎంసీలు కూడా ఇవ్వడం లేదు. డ్యాంలో 95 శాతం పైగా నీరు ఉంది, కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే అక్కడ ఆయకట్టుకు నీరు విడుదల చేసింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్చెల్సీ, జీబీసీ కాలువల కింద రైతులు సాగు చేస్తున్న ఆరుతడి పంటలకైనా నీరు విడుదల చేయాలి. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రైతులతో కలిసి ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం.

– వై.విశ్వేశ్వరరెడ్డి,

వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement