ఉరవకొండ: కాలువల్లో నీరు పారుతున్నా ఆయకట్టుకు మాత్రం చుక్క కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ విషయంలో మొద్దు నిద్ర పోతున్న చంద్రబాబు ప్రభుత్వానికి కళ్లు తెరిపించేందుకు వైఎస్సార్ సీపీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నముస్టూరు సమీపంలోని హంద్రీ–నీవా కాలువ సమీపంలో 42వ జాతీయ రహదారిని రైతులతో కలిసి దిగ్భంధించాలని నిర్ణయించింది. హెచ్‌ఎల్‌సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీబీసీ ద్వారా పంటలకు సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలనేదే వైఎస్సార్ సీపీ ప్రధాన డిమాండ్. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
ప్రభుత్వంలో వణుకు..
ఆయకట్టు రైతులతో కలిసి అనంతపురం– బళ్లారి 42వ జాతీయ రహదారిని దిగ్బంధించేందుకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సిద్ధమైన తరుణంలో చంద్రబాబు ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ధర్నాలు, నిరసన ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని, నియోజకవర్గంలో 30 యాక్టు అమల్లో ఉందంటూ గుంతకల్లు డీఎస్పీ ద్వారా అధికారిక ప్రకటన జారీ చేయించడమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా ధర్నాను భగ్నం చేయడానికి పెద్ద ఎత్తున పోలీసులను మోహరించనున్నట్లు తెలిసింది.
ఆయకట్టుకు సాగునీటి విడుదలపై వైఎస్సార్ సీపీ ఉద్యమం
నేడు పార్టీ పీఏసీ సభ్యుడు
విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో
జాతీయ రహదారి దిగ్బంధం
తరలిరానున్న
ఆయకట్టు రైతులు, పార్టీ శ్రేణులు
భగ్నం చేయడానికి
అధికార పార్టీ నేతల కుట్రలు


