కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సెప్టెంబర్ 4వ తేదీ శ్రావణ గురువారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు కలశపూజ ఉంటుందని, అనంతరం వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుందన్నారు. వ్రతంలో పాల్గొనాలనుకునే మహిళలు సెప్టెంబర్ 3వ తేదీలోపు తమపేర్లు ఆలయ ఈఓ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే వ్రతం ఆచరించాలనుకునే వారు తప్పనిసరిగా కలశం చెంబు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.


