కూడేరు: న్యూఢిల్లీలో వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించనున్న ఆల్ ఇండియా సైనిక్ క్యాంపునకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లను ఎంపిక చేశారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్‌సీసీ నగర్‌లో నిర్వహిస్తున్న ఎంపిక శిబిరాన్ని గురువారం కర్నూల్ ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సమీర్ శర్మ సందర్శించారు. క్యాంపు నిర్వాహణ, క్యాడెట్ల ఎంపిక తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆల్ ఇండియా సైనిక్ క్యాంపునకు ఎంపికై న విద్యార్థులు శుక్రవారం న్యూఢిల్లీకి బయలుదేరుతున్నట్లు అధికారులు ఆయనకు వివరించారు.


