●ఆశల పంట.. ఆవేదనే రైతు ఇంట | - | Sakshi
Sakshi News home page

●ఆశల పంట.. ఆవేదనే రైతు ఇంట

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

పంపనూరు వద్ద రోడ్డు పక్కన పడేసిన టమాటాలు

ఒక్క కోత కూడా కోయకుండానే ట్రాక్టర్‌తో టమాట పంటను దున్నేస్తున్న దృశ్యం

మంచి ధరలు వస్తాయన్న ఆశతో అప్పు చేసి మరీ పంట సాగు చేస్తే చివరికి ఆవేదనే మిగిలింది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికందని దుస్థితి దాపురించింది. దీంతో చేసేదిలేక ఒక్క కోత కూడా కోయకుండానే పంటను నిలువునా దున్నేస్తున్నారు. కొందరు రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఆత్మకూరుకు చెందిన రైతు పుల్లారెడ్డి రెండు ఎకరాల్లో టమాట పంట పెట్టాడు. మొత్తం రూ.1.20 లక్షల ఖర్చయింది. పంట చేతికి వచ్చిన సమయంలో మార్కెట్‌లో ధరలు లేకపోవడం శాపంగా పరిణమించింది. ఒక్క కోత కూడా కోయకుండానే గురువారం ట్రాక్టర్‌తో రెండు ఎకరాల్లోని పంటను ధ్వంసం చేయాల్సి వచ్చింది. – ఆత్మకూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement