కోర్ బ్రాంచ్‌ల వైపు వెళ్తే రెండు విధాలుగా అవకాశం ఉంటుంది. సాఫ్ట్‌వేర్ వైపు వెళ్లొచ్చు. లేదా మౌలిక సదుపాయాల రంగాల్లో ఉద్యోగాలు దక్కుతాయి. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు స్వయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. 100కు 80 మంది కంప్యూటర్ సైన్సెస్ చదువుతున్నారు. ఏఐ రావడంతో ఉపాధిపై దెబ్బ పడుతోంది. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) వైపు వెళ్లడం లేదు. అంకితభావంతో కృషి చేస్తే సర్వీసెస్‌లో కొలువు సాధించవచ్చు.
– డాక్టర్ బి.రమేష్ బాబు,
ప్రిన్సిపాల్, పీవీకేకే కళాశాల


