సాఫ్ట్‌వేర్ రంగం ట్రెండ్ మారొచ్చు. ఎంత టెక్నాలజీ మారినా భౌతిక నిర్మాణాలు, యంత్రాలు, విద్యుత్ వ్యవస్థలు ఎప్పటికీ అవసరమే. బుల్లెట్ రైళ్లు, స్మార్ట్ నగరాలు, మెగా ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోర్ ఇంజినీర్ల ద్వారానే సాధ్యమవుతాయి. పవర్ గ్రిడ్ నిర్వహణ, ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయి. కోర్ బ్రాంచ్ కోర్సులు పూర్తి చేస్తే తొలుత తక్కువ ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి వేతనాలు అందుకుంటారు.
–ప్రొఫెసర్ బి. దుర్గాప్రసాద్,
డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ఆడిట్,
జేఎన్‌టీయూ అనంతపురం


