వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

కొడవళ్లు, గొడ్డళ్లతో విరుచుకు పడిన టీడీపీ కార్యకర్తలు

బ్రహ్మసముద్రం : రాయలప్పదొడ్డిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో హత్యాయత్నం చేశారు. గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. బాధితుల కథనం మేరకు... ఇంటి స్థలం విషయంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. బుధవారం రాత్రి ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు రాఘవేంద్ర, ప్రసాద్‌, తిప్పేస్వామి, సురేంద్ర వేటకొడవళ్లు, గొడ్డళ్లతో విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హరిజన హరికృష్ణ, మల్లేశప్ప, కొల్లాపురిపై విచక్షణారహితంగా నరకడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. అంతటితో ఆగక కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. గాయపడిన హరి కృష్ణ, మల్లేశప్ప, కొల్లాపురిని కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

గాయపడిన హరికృష్ణ, మల్లేశప్ప, కొల్లాపురి

Advertisement
 
Advertisement
Advertisement