22 మండలాల్లో వర్షం | - | Sakshi
Sakshi News home page

22 మండలాల్లో వర్షం

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

లోతట్టు ప్రాంతాలు జలమయం

ఉరవకొండలో దంచికొట్టిన వాన

అనంతపురం అగ్రికల్చర్‌: నైరుతి ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలోని 22 మండలాల పరిధిలో వర్షం కురిసింది. 5.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బెళుగుప్ప మండలంలో 25.4 మి.మీ, కణేకల్లు మండలంలో 25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక రాయదుర్గం మండలంలో 20.6 మి.మీ, బ్రహ్మసముద్రం 14.4, గార్లదిన్నె 12.6, శెట్టూరు 10.8, యాడికి మండలంలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జూన్‌ సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా, ప్రస్తుతానికి 28.7 మి.మీ నమోదైంది. ఈనెలలో 4 వర్షపు రోజులు నమోదైనా... ఇంకా చాలా మండలాల్లో పదునైన వర్షం కురవలేదు. వజ్రకరూరు, గుత్తి, తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో సాధారణం కన్నా 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

ఉరవకొండలో భారీ వర్షం

ఉరవకొండ: ఉరవకొండలో మంగళవారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షంతో క్లాక్‌టవర్‌ వద్ద మోకాలు లోతు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్ల మీద ఆకుకూరలు, కూరగాయలు విక్రయించే వ్యాపారులు అవస్థలు పడ్డారు. అయితే చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా వర్షం కురవకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement