‘అక్షరాంధ్ర’ రిజిస్ట్రేషన్‌ గడువులోగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘అక్షరాంధ్ర’ రిజిస్ట్రేషన్‌ గడువులోగా పూర్తి చేయాలి

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

రాప్తాడు రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి వలంటీర్‌ టీచర్లు – నిరక్షరాస్య అభ్యాసకుల జతపరిచే నమోదు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. మంగళవారం రాప్తాడులోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌ ‘ఉల్లాస్‌ – అక్షరాంధ్ర’ కార్యక్రమం నమోదు ప్రక్రియను పరిశీలించారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్లతో మాట్లాడి అభ్యాసకుల నమోదు పురోగతిపై ఆరా తీశారు. రాప్తాడు మండలంలో మొదటి విడతలో అక్షరాస్యత సాధించిన అభ్యాసకుల వివరాలు, రెండోదశ కార్యక్రమానికి గుర్తించిన అభ్యాసకుల సంఖ్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట వయోజన విద్య ఉపసంచాలకులు ఎస్‌.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయలక్ష్మి, పర్యవేక్షకులు జీవీ రమణ, డీఆర్డీఏ ఏపీఎం సునీత, ఉపాధి హామీ పథకం ఏపీఓ సావిత్రి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కంటైనర్‌ ఎక్కిన రైలింజన్‌

గార్లదిన్నె: సాధారణంగా గూడ్సురైలులో లారీలు ఇతర వాహనాలను తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే రైలు ఇంజిన్‌ను కంటైనర్‌ లారీలో తీసుకెళ్లడం ప్రజలు వింతగా తిలకించారు. మంగళవారం బెంగళూరు నుంచి ఒడిశాకు రైలింజన్‌ను తీసుకెళ్తున్న లారీ కంటైనర్‌ గార్లదిన్నె మండలం ఎగువపల్లి జాతీయరహదారి వద్ద కాసేపు ఆగింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు రైలింజన్‌ను ఎంతో ఆసక్తిగా చూశారు.

Advertisement
 
Advertisement
Advertisement