గత ప్రభుత్వంలో జనానికి ఏ పని కావాలన్నా సచివాలయంలోనే జరిగేవి. ఇప్పుడు సచివాలయ వ్యవస్ధ నాశనమైంది. అక్కడ ప్రభుత్వ సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో సీఎస్‌సీ, మీ సేవ కేంద్రాలకు వెళ్లి కావాల్సిన సేవలకు డబ్బులు కట్టి చేయించుకోవాలి. అవి కూడా మండల కేంద్రానికి వెళ్లినా అంత సులభంగా జరగవు. ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాలి కానీ.. ఇలా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు.
– ఆంజనేయులు, మాజీ సర్పంచ్,
సిద్దరాంపురం, బొమ్మనహాళ్ మండలం


