సందర్భం : నేడు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే
అనంతపురం సిటీ: ఇటీవల బెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్లు చాలా మందిని భయడపెతున్నాయి. అనారోగ్యకరమైన జీవన శైలితో పాటు రేడియేషన్, జెనెటిక్ డిసార్డర్ కూడా ఇందుకు కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరుదైన కొన్ని సందర్భాల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగానూ బ్రెయిన్ ట్యూమర్ బారిన పడే ప్రమాదముంటుందని చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఏటా వంద కేసులు..
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏడాదికి 80 నుంచి 100 కేసులు ఉంటున్నట్లు అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీర్ఘకాలంగా తలనొప్పితో బాధపడుతున్నా.. నొప్పి తీవ్రత తాళలేక వాంతులవుతున్నా.. మూర్ఛపోతున్నా వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి తోడు వినికిడి లోపం తలెత్తినా, చెవుల్లో ఈల వంటి శబ్ధం వస్తున్నా, నడుసున్నప్పుడు.. కూర్చున్నప్పుడు తడబాటుకు లోనవ్వడం కూడా బ్రెయిన్ ట్యూమర్‌కు ప్రాథమిక లక్షణాలను వైద్యులు అంటున్నారు.
ప్రతి ట్యూమరూ క్యాన్సర్ కాదు..
సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ ప్రాథమిక లక్షణాలు కనిపించకపోవచ్చు కానీ, తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలు, వికారం, మూర్ఛ, సమతుల్యత కోల్పోవడం, జ్ఞాపకశక్తి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆహారం, నిద్ర, వ్యాయామం, ఒత్తిడి తదితర అంశాలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అయితే ప్రతి బ్రెయిన్ ట్యూమర్.. బ్రెయిన్ క్యాన్సర్‌గా మారదని వైద్యులు పేర్కొంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో సరైన శస్త్రచికిత్స ద్వారా బ్రెయిన్ ట్యూమర్‌ను నయం చేయవచ్చని సూచిస్తున్నారు.
రేడియేషన్‌కు దూరంగా మేలు..
ఆధునికత సాంకేతికత అందుబాటులో వచ్చిన తర్వాత రేడియేషన్ ప్రభావం అందరిపై ప్రభావం చూపుతోంది. పిల్లలు, యువత విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటి వరకూ దేశీయంగా బెయిన్ ట్యూమర్ బారిన పడిన వారిలో అత్యధికులు చిన్నపిల్లలు, యువతీ యువకులేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జెనిటిక్ డిసార్డర్ సమస్యలు ఉన్న వారు బ్రెయిన్ ట్యూమర్ బారిన పడే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
రేడియేషన్ కారణంగా
బ్రెయిన్ ట్యూమర్
జెనెటిక్ డిసార్డర్‌తోనూ సమస్య
తలనొప్పి.. ఎప్పుడో ఓ సారైతే పర్వాలేదు.. కానీ క్రమం తప్పకుండా తలనొప్పి ఉందంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది బ్రెయిన్ ట్యూమర్‌కి
దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు. ఈ విషయాలపై
ప్రజలను చైతన్య పరిచేందుకు ఏటా జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని నిర్వహిస్తూ వస్తున్నారు.


