తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని చుక్కలూరు క్రాస్‌లో ఉన్న ఎమ్మెస్సార్ గ్రానైట్ ఫ్యాక్టరీలో కుటుంబ కలహాలతో కార్మికుడు పన్నారామ్ (34) ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి వివరాలమేరకు.. రాజస్థాన్‌కు చెందిన పన్నారామ్ ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం తాడిపత్రికి వచ్చాడన్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో బంధువులు ఉండటంతో వారి సాయంతో కార్మికునిగా పనిచేస్తున్నాడని చెప్పారు. కొన్ని రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లాడని, అక్కడ కుటుంబ సభ్యులతో గొడవపడి తాడిపత్రికి వచ్చాడన్నారు. మనస్తాపంతో శనివారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఉదయం ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు కిటికిలోనుంచి చూడగా పన్నారామ్ ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించిదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నామన్నారు.
బెంగళూరులో
యాడికి యువకుడు..
యాడికి: మండల కేంద్రానికి చెందిన వెంకటనారాయణరెడ్డి , అరుణ దంపతుల చిన్న కుమారుడు కిశాంత్‌శాడ్డి (24) బెంగళూరులో తాను నివసిస్తున్న గదిలోనే శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కిశాంత్‌రెడ్డి బెంగుళూరులోనే చదువుకొని అక్కడే ప్రైవేటు కంపెనీలో నెల క్రితం ఉద్యోగంలో చేరారు. జూన్ నెలలో జీతం కూడా పొందిన కిశాంత్‌రెడ్డి తన తల్లికి తన మొదటి జీతం ఇవ్వడానికి వారం క్రితం యాడికికి వచ్చాడు. మూడు రోజుల క్రితం మళ్లీ బెంగళూరు వెళ్లిన కిశాంత్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని యాడికికి తీసుకురాగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే కిశాంత్‌రెడ్డి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


