‘పచ్చ’ తోడేళ్ల చెరలో చెరువులు విలవిల | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ తోడేళ్ల చెరలో చెరువులు విలవిల

Jun 6 2026 12:29 AM | Updated on Jun 6 2026 12:29 AM

చిత్రచేడు, అప్పేచర్లలో విచ్చలవిడిగా మట్టి దోపిడీ

పెద్దవడుగూరు: మండలంలోని చిత్రచేడు, అప్పేచర్ల గ్రామాల్లోని చెరువులను ‘పచ్చ’ నాయకులు చెరబట్టారు. రైతుల మాటున విచ్చలవిడిగా మట్టిని తోడేస్తూ జేబులు నింపుకుంటున్నారు. రెండు వారాలుగా దందా సాగిస్తున్నారు. ఆయా చెరువుల నుంచి నిత్యం సుమారు వంద టిప్పర్ల మట్టిని డోన్‌, కర్నూల్‌, గుంతకల్లు తదితర ప్రాంతాలకు తరలించి రూ. లక్షలు వెనకేసుకుంటున్నారు. అప్పేచర్ల చెరువులో పలువురు పేద రైతులు సాగుచేసుకుంటున్న చోట కూడా మట్టి తరలించి కడుపు కొడుతున్నారు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మట్టి టిప్పర్లు ప్రధాన దారుల్లో దూసుకెళ్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు హడలెత్తుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement