పామిడి సర్వేయర్‌పై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

పామిడి సర్వేయర్‌పై సస్పెన్షన్‌ వేటు

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

పామిడి: పామిడి మండల సర్వేయర్‌గా పని చేస్తున్న ఎస్‌. మురళీధర్‌ను సస్పెండ్‌ చేస్తూ సర్వే శాఖ డైరెక్టర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ప్రజలు అందించే భూ కొలతల సమస్యల పరిష్కారంలో రాష్ట్రవ్యాప్తంగా 8 మంది మండల సర్వేయర్లు నిర్లక్ష్యం వహించారు. అందులో భాగంగా పామిడి సర్వేయర్‌ కూడా ఉన్నారు. సర్వే సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటున్న పామిడి సర్వేయర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

అడవులు సృష్టిస్తాం

నెట్‌ జీరో హెల్తీ క్యాంపస్‌ పేరులో జిల్లాలో మొక్కల పెంపకాన్ని చేపటేందుకు ప్రణాళికలను తయారు చేశాం. దీంతో మొక్కలు పెరగడానికి అవసరమైన అన్ని రకాల వసతులు ఒకేచోట కల్పిస్తున్నాం. కన్నా శాంతివనం స్ఫూర్తితో ఒకే ఆవరణలో చిన్న తరహాలో అడువులను సష్టించేలా చర్యలు చేపట్టాం. జిల్లాలో మొక్కల పెంపకం కోసం 48 ప్రభుత్వ నివాస పాఠశాలప్రాంగణాల్లో గుంతలు తీసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.

– సలీం బాషా, డ్వామా,

ప్రాజెక్టు డైరెక్టర్‌

ప్రతిఒక్కరూ మొక్క నాటండి

అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని అటవీశాఖ డివిజనల్‌ అధికారి గురుప్రభాకర్‌ పిలుపునిచ్చారు. జిల్లాలో 13 లక్షల విత్తనపు బంతులు వెదజల్లనున్నట్లు తెలిపారు. గార్లదిన్నె, సలకం చెరువు, ఎర్రగుంటపల్లి, ఎస్కేయూనివర్సిటీ, తాడిప్రతి, పుట్లూరు, పెద్దవడుగూరు, గుంతకల్లు, పెన్నహోబిలం తదితర నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement