కళ్యాణదుర్గం: నేను మెగా డీఎస్సీ–2005లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) పరీక్ష రాసి 72.90 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించా. వాస్తవానికి ఉద్యోగాల భర్తీలో ఓపెన్ ర్యాంక్‌లో 11,13 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు ఓపెన్‌లో కాకుండా రెండు పోస్టులను బీసీ– డీ రిజర్వేషన్‌లో కేటాయించారు. ఓపెన్‌లో పంపించకుండా రెండు పోస్టులు రిజర్వేషన్ బీసీ– డీ రిజర్వేషన్‌కు పంపడం విద్యాశాఖ అధికారుల లోపాయికారి వ్యవహారం. ఎస్సీ, బీసీ కేటగిరీలోనూ ఇలాగే జరిగింది. నేను నెలలు పాటు అనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ కుటుంబానికి దూరంగా ఉండి డీఎస్సీ కోసం సన్నద్ధమయ్యా. ఇలాంటి సమయంలో మెరిట్ జాబితా, తుది ఎంపిక జాబితాను బయటకు పెట్టకుండా విద్యాశాఖ అధికారులు లోపాయి కారిగా పోస్టులు కట్టబెట్టారు. విద్యాశాఖ అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరపాలి. మా లాంటి వారికి న్యాయం చేయాలి.
– పూజారి గోపాల్, ముప్పలకుంట


