సందర్భం | - | Sakshi
Sakshi News home page

సందర్భం

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

కాపాడతారా..కాటేస్తారా?

‘అనంత అరణ్య’ం పేరిట అటవీకరణకు శ్రీకారం

అనంతపురం న్యూటౌన్‌ : అతి తక్కువ వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లాలో విరివిగా మొక్కలు పెంచే బహత్తర కార్యక్రమానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ అనంత అరణ్య’ పేరుతో అటవీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో డ్వామా, జిల్లా పరిషత్‌, సాంఘిక సంక్షేమ శాఖల సమన్వయంతో అమలు చేయనున్నారు. ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో కార్యాచరణకు సంకల్పించారు. జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలోని పాఠశాల ఆవరణలను ఎంపిక చేశారు. అయితే ఈఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అధికారులను కలవరపెడుతున్నాయి. ఇందుకు సూపర్‌ ఎల్‌–నినో ప్రభావం కూడా తోడవుతుండడంతో ‘ అనంత అరణ్య’ కార్యక్రమం ద్యారా మొక్కలు ఏపుగా పెరుగుతాయో లేక గతంలో మాదిరిగా నాటిన మొక్కలు నిలువునా ఎండి గుంతలకే పరిమితమౌతాయో వేచి చూడాల్సిందే. జిల్లాలో అటవీకరణ, పచ్చదనం పెంపునకు 28 మండలాల్లోని 48 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతి 25 సెంట్ల విస్తీర్ణంలో 1,625 మొక్కలను నాటనున్నారు. సుమారు 108 ఎకరాల్లో 80 వేల మొక్కలు అవసరం కానున్నాయి. అధికారులు గుర్తించిన మండలాల్లో సగానికి పైగా మొక్కలు పెంచడానికి అనువైన పరిస్థితులున్నాయని మొదటి దశలో రెసిడెన్షియల్‌ పాఠశాలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ ఆవరణల్లో ‘అనంత అరణ్య’ ను అమలు చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement