చివరి క్షణంలో ఉద్యోగం చేజారిపోయింది! | - | Sakshi
Sakshi News home page

చివరి క్షణంలో ఉద్యోగం చేజారిపోయింది!

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ పోస్టుల భర్తీలో నాకు అన్యాయం జరిగింది. డీఎస్సీ–25 నోటిఫికేషన్‌లో ఎస్సీ–3 కేటగిరీ కింద ఐదు జనరల్‌ పోస్టులు చూపించారు. అందుకే 5వ అభ్యర్థిగా ఉన్న నాకు కచ్చితంగా ఉద్యోగం వస్తుందని సంతోషించాను. అయితే చివరికి నాలుగు పోస్టులు భర్తీ చేసి, ఐదో పోస్టు స్పోర్ట్స్‌ కోటా కింద కేటాయించారు. దీంతో నాకు ఉద్యోగం చేజారిపోయింది. 57 మార్కులు సాధించి 219 మెరిట్‌ ర్యాంకుతో ఎస్సీ–3 కేటగిరీలో 5వ అభ్యర్థిగా నిలిచా. ‘ఒకవేళ ఆ పోస్టు స్పోర్ట్స్‌ కోటాకు కేటాయించాల్సి ఉంటే నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా చూపించాల్సింది. ఐదు పోస్టులూ ఎస్సీ–3 కేటగిరీలోనే చూపించి, తర్వాత ఒక పోస్టు స్పోర్ట్స్‌ కోటాకు మళ్లించడంతో నష్టపోయా. ఎస్జీటీ వైపు కాకుండా స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుపైనే పూర్తిగా దృష్టి పెట్టా. ఎన్నో త్యాగాలు చేసి, రాత్రింబవళ్లు కష్టపడి చదివా. ఉద్యోగం చేతికొచ్చిందనుకునే సమయంలో ఇలా జరగడం చాలా బాధ కలిగించింది. నేను కోచింగ్‌ తీసుకున్న ఇన్‌స్టిట్యూట్‌లో కూడా ఉద్యోగం వస్తుందని భావించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ చివరి క్షణంలో పోస్టు భర్తీ విధానం మారడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి. – జూటూరు రెడ్డప్ప,

డీఎస్సీ–25 అభ్యర్థి, అనంతపురం

Advertisement
 
Advertisement
Advertisement