బధిర చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు | - | Sakshi
Sakshi News home page

బధిర చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు

Mar 3 2026 8:07 AM | Updated on Mar 3 2026 8:07 AM

జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌

అనంతపురం అర్బన్‌: వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా ఉచితంగా అందిస్తున్న కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్ర చికిత్సను సద్వినియోగం చేసుకోవాలని బధిర చిన్నారుల తల్లిదండ్రులకు జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 3న ప్రపంచ శ్రవణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో కిమ్స్‌ సవేరా ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా కిమ్స్‌ సవేరాలో కాక్లియర్‌ ఇంప్టాంట్‌ శస్త్ర చికిత్స చేయించుకున్న 50 మంది చిన్నారులకు కిట్లను ఆందజేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్‌ గంగాధర్‌రెడ్డి, సవేరా ఆస్పత్రి సీఈఓ సిద్ధారెడ్డి, ఈఎన్‌టీ నిపుణులు రాఘవేంద్రరెడ్డి, పీఆర్‌ గిరి, సిబ్బంది, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement