ముగిసిన ఎకై ్సజ్‌ క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎకై ్సజ్‌ క్రీడా పోటీలు

Mar 3 2026 8:07 AM | Updated on Mar 3 2026 8:07 AM

అనంతపురం సెంట్రల్‌: స్థానిక పరేడ్‌ మైదానం వేదికగా ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ఉద్యోగుల మధ్య రెండు రోజుల పాటు సాగిన క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. క్రికెట్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌లో అనంతపురం జిల్లా, కబడ్డీలో శ్రీసత్యసాయి జిల్లా జట్లు విజేతగా నిలవగా... వాలీబాల్‌ మ్యాచ్‌ టై కావడంతో రెండు జిల్లాల జట్లను విజేతగా ప్రకటించారు. ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ను అనంతపురం జిల్లా జట్లు కై వసం చేసుకుంది. పోటీల ముగింపు సందర్భంగా సోమవారం సాయంత్రం పరేడ్‌ మైదానంలో బహుమతుల ప్రదానోత్సవం అట్టహాసంగా సాగింది. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య, ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్‌ అధికారులు రామ్మోహన్‌రెడ్డి, గోవింద్‌నాయక్‌, అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్లు నరసింహులు, రేవతి తదితరులు మాట్లాడారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు అలరించారు. కార్యక్రమంలో డీఎం వేణుగోపాలరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జయనాథరెడ్డి, కార్యదర్శి జాకీర్‌హుస్సేన్‌, నాయకులు జయనరసింహ, నరేష్‌బాబు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement