డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌

Feb 25 2026 9:01 AM | Updated on Feb 25 2026 9:01 AM

డిప్య

డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌

అనంతపురం అర్బన్‌: జిల్లాలో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 50 మంది డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.కె.మహబూబ్‌బాషాను సీసీఎల్‌ఏ అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమించారు. డిప్యూటీ కలెక్టర్‌ జి.నాగరాజును వైఎస్సార్‌ కడప జిల్లా కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీగా నియమించారు. ఉరవకొండ తహసీల్దార్‌గా ఉన్న మహబూబ్‌బాషాకు, రాయదుర్గం తహసీల్దారు నాగరాజుకు గత ఏడాది అక్టోబరు 17న డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందారు. పోస్టింగ్‌ ఇవ్వని కారణంగా వారు అవే స్థానాల్లో కొనసాగారు. ప్రస్తుతం వారికి ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది.

ఎంబీఏ, ఎంసీఏ ఫలితాల విడుదల

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో డిసెంబర్‌, జనవరి నెలలో నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ ఒకటో సెమిస్టర్‌, రెండో సెమిస్టర్‌ (ఆర్‌–21), రెగ్యులర్‌, సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ వి.నాగప్రసాద్‌ నాయుడు తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

శనగల కొనుగోలు

వేగవంతం చేయండి

అనంతపురం అర్బన్‌: శనగల కొనుగోలు వేగవంతం చేయాలి జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ అధికారులను ఆదేశించారు. జేసీ మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లాస్థాయి కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనగలు క్వింటాలుకు రూ.5,875 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లావ్యాప్తంగా పంట సేకరణకు ప్రొక్యూర్‌మెంట్‌ ఏజెన్సీలను ఖరారు చేశామన్నారు. రైతులు తమ సమీప కేంద్రాల్లోనే పంటను అమ్ముకునేలా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి రవి, ఏపీ మార్క్‌ఫెడ్‌ డీఎం పెన్నేశ్వరి ఇతర అధికారులు పాల్గొన్నారు.

28న పింఛన్ల పంపిణీ

అనంతపురం టౌన్‌: ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ ఈ నెల 28న చేపట్టనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి ఒకటో తేదీన ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేదీనే పింఛన్‌ పంపిణీ ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

నిధి పోర్టల్‌ ద్వారా పొందొచ్చు

అనంతపురం అర్బన్‌: జిల్లాలోని డీడీఓ సంబంధిత శాఖ సిబ్బంది జీపీఎఫ్‌, రిటైర్మెంట్‌ తుది ఉపసంహరణ ప్రయోజనాలను నిధి పోర్టల్‌ ద్వారా పొందవచ్చని జిల్లా ఖజానా శాఖ డీడీ రమణయ్య మంగళవారం తెలిపారు. ఈ నెల 14న ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోలు 9, 10 ప్రకారం ప్రతి డీడీఓ తప్పనిసరిగా నిధి పోర్టల్‌లో లాగిన్‌ అయ్యి వర్క్‌ ఫ్లో కాన్ఫిగరేషన్‌ చేసి ఏపీ జీపీఎఫ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్లకు సంబంధించిన అంశాలను పూర్తి చేయాలన్నారు.

డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌ 1
1/2

డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌

డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌ 2
2/2

డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement