నరసాపురం వెల్ఫేర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు
బెళుగుప్ప: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నరసాపురం గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కార్తీక్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ విషయాన్ని డిప్యూటీ ఎంపీడీఓ ఏకాంబరేశ్వరయ్య మంగళవారం మీడియాకు తెలిపారు. సామాజిక భద్రత పింఛన్‌కు సంబంధించి 2025 సెప్టెంబర్ నెలలో బట్వాడా చేయని రూ.96వేల నగదును సకాలంలో ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు.
359 మంది
విద్యార్థులు గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం తెలుగు/ సంస్కృతం/ ఉర్దూ/ హిందీ పరీక్షలకు జిల్లాలో 359 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 64 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు జనరల్ విద్యార్థులు 20,919 మందికి గాను 20,588 మంది హాజరయ్యారు. 331 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,900 మందికి గాను 1,872 మంది హాజరయ్యారు. 28 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనరు, ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ ఐదు కేంద్రాలను తనిఖీలు చేశారు. అలాగే జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి గురవయ్యశెట్టి 6, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 4, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు 8, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 10 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు.


