●పాసున్నా.. బస్సు ఆపకపాయే
బొమ్మనహాళ్: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తోంది. రోడ్డుపై విద్యార్థులను చూడగానే డ్రైవర్లు బస్సులు ఆపడం లేదు. దీంతో తిప్పలు తప్పడం లేదు. బొమ్మనహాళ్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఉద్దేహాళ్, శ్రీధరఘట్ట, తిమ్మలాపురం, కొలగానహాళ్లి, ఉప్పరహాళ్, సింగాన హళ్లి, ఎల్‌బీ నగర్, గోనేహాళ్, లింగదహాళ్, బండూరు తదితర గ్రామాల నుంచి 300 మందికి పైగా విద్యార్ధులు వస్తుంటారు. వీరందరూ డబ్బు కట్టి బస్సు పాసులు తీసుకున్నారు. అయినా అవి నిరుపయోగంగా మారాయి. దీంతో కళాశాలకు సకాలంలో చేరేందుకు లగేజీ ఆటోలు, ట్రాక్టర్లపై ప్రమాదకర స్థితిలో ప్రయాణం సాగిస్తున్నారు. మరికొందరు విద్యార్థులు కాలినడకన చేరుకుంటున్నారు. ఇక కళాశాల ముగిసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. దీంతో ఇంటికి చేరుకునే లోపు చీకటి పడుతోంది. అధికారులు స్పందించి విద్యార్థులకు ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌలభ్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు.


