పోలీసుల తీరు మారాలి
రాయదుర్గం: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించే విషయంలో పోలీసుల తీరు పూర్తిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, రాయదుర్గం, కళ్యాణదుర్గం సమన్వయకర్తలు మెట్టు గోవిందరెడ్డి, తలారి రంగయ్య అన్నారు. బుధవారం రాయదుర్గంలో పార్టీ నాయకులతో కలసి వారు మాట్లాడారు. పోలీసు వ్యవస్థపై తమకు అపార గౌరవం ఉందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాప్తాడు పర్యటనలో పోలీసుల భద్రత వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ అంశంపై తమ పార్టీ నాయకులపైనే అక్రమ కేసులు బనాయించడం సరైందికాదన్నారు. ఇటీవల రాయదుర్గంలోనూ వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదు చేసి వివాదానికి కారణమయ్యారని మండిపడ్డారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన 11 నెలలవుతోందని, సీఎం చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బాబు పాలనలో స్కీములు తక్కువ స్కాములు ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, సమన్వయకర్తలు మెట్టు, రంగయ్య


