ఓట్ల కౌంటింగ్‌ నివేదికలో మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

ఓట్ల కౌంటింగ్‌ నివేదికలో మాయాజాలం

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

5న 39,233 ఓట్లు పోలైనట్లుగా అధికారుల ప్రకటన

ఎంపీటీసీ అభ్యర్థులవి 39,456 ఓట్లుగా లెక్కింపు

జెడ్పీటీసీ అభ్యర్థుల కౌంటింగ్‌లో 39,920గా నివేదిక

తీవ్ర వ్యత్యాసాలతో కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలపై అనుమానాలు

వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్‌

నాతవరం: ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికారులు కలెక్టర్‌కు సమర్పించిన నివేదికల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. మండలంలోని 31 పంచాయతీల పరిధిలో 51,781 మంది ఓటర్లు ఉండగా, 65 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 5న పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 19,011 మంది పురుషులు, 20,222 మంది మహిళలు కలిపి 39,233 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు నివేదించారు. అయితే, కౌంటింగ్‌ అనంతరం ఎంపీటీసీ అభ్యర్థులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కలిపి 39,456 ఓట్లు నమోదైనట్లు కలెక్టర్‌కు నివేదిక పంపించారు. జెడ్పీటీసీకి సంబంధించి టీడీపీకి 122, వైఎస్సార్‌సీపీకి 98, ఇతరులకు 4, చెల్లని ఓటు ఒకటి కలిపి మొత్తం 245 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చినట్లు ప్రకటించారు. కానీ జెడ్పీటీసీ కౌంటింగ్‌ నివేదికలో మొత్తం 39,920 ఓట్లు నమోదైనట్లు చూపించారు. పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన 39,233 ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ 245 ఓట్లు కలిపితే 39,478 మాత్రమే అవుతాయి. దీంతో 442 ఓట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ నివేదికల మధ్య కూడా 464 ఓట్ల తేడా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అధికారుల లెక్కల్లో పొరపాట్లు జరిగాయా? లేక కూటమి నేతల ప్రభావంతో ఓట్ల లెక్కింపు జరిగిందా? అంటూ ఓటమి చెందిన అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ స్పందించి పోలింగ్‌, కౌంటింగ్‌ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement