డీసీసీబీ 45వ ఆవిర్భావ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

డీసీసీబీ 45వ ఆవిర్భావ వేడుకలు

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

అనకాపల్లి: స్థానిక మెయిన్‌రోడ్డు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో బ్యాంకు 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం రాత్రి జరిగాయి. అంతకుముందు బ్యాంక్‌ మేనేజర్‌ ఆర్‌.వి.లలిత కేక్‌ కట్‌ చేసి ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 45 సంత్సరాలుగా సుదీర్ఘ ప్రస్థానంలో ఖాతాతారుల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావం, సహకార రంగ భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి సాధించామన్నారు. అనంతరం ఖాతాదారులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ ఫీల్డ్‌ అఽధికారి ఎ.శ్రీనివాసరావు, ఏఎంలు రత్నం, హేమ, వాగ్దేవి, ఉద్యోగులు నూకేష్‌, నాయుడు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement