అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ ● ఘనంగా న్యాయ సేవా దినోత్సవం

విశాఖ లీగల్‌: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించడమే న్యాయ సేవా ప్రాధికార సంస్థ లక్ష్యమని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో నిర్వహించిన న్యాయ సేవా దినోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39(ఎ) ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందన్నారు. పేదలు, మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు మాట్లాడుతూ అర్హులైన వారికి నిరంతరం న్యాయ సహాయం అందించేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు. న్యాయ సహాయ క్లినిక్‌లు, ప్రత్యేక శిబిరాల ద్వారా సేవలందిస్తున్నామని, పారా లీగల్‌ వలంటీర్లకు శిక్షణ ఇవ్వడంతోపాటు న్యాయవాదుల సేవలను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఎస్‌. కృష్ణమోహన్‌, ఉపాధ్యక్షుడు బీవీఆర్‌ మూర్తి, జాతీయ న్యాయ సేవా శిక్షకుడు రఘుపాత్రుని శ్రీనివాసరావు, సీనియర్‌ న్యాయవాదులు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement