తాటిచెట్లపాలెం: దీపావళి, ఛత్ పండగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగించినట్లు విశాఖపట్నం రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు దువ్వాడ మీదుగా రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్ల వివరాలను వెల్లడించారు.
●తిరువనంతపురం నార్త్–సంత్రగచ్చి (06081): ఈ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 6, 11 తేదీల్లో శుక్రవారాల్లో మధ్యాహ్నం 2.15 గంటలకు తిరువనంతపురం నార్త్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 10.33 గంటలకు దువ్వాడ చేరుకుని, 10.35 గంటలకు బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది.
●సంత్రగచ్చి–తిరువనంతపురం నార్త్ (06082): తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఈ నెల 9, 16 తేదీల్లో సోమవారాల్లో మధ్యాహ్నం 2.15 గంటలకు సంత్రగచ్చిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4.18 గంటలకు దువ్వాడ చేరుకుని, 4.20 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 9.55 గంటలకు తిరువనంతపురం నార్త్ చేరుకుంటుంది.
●ఎర్నాకుళం జంక్షన్–పాట్నా (06085): ఈ వీక్లీ స్పెషల్ రైలు ఈ నెల 6, 11 తేదీల్లో శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ఎర్నాకుళం జంక్షన్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 11.23 గంటలకు దువ్వాడ చేరుకుని, 11.25 గంటలకు బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పాట్నా చేరుకుంటుంది.
●పాట్నా–ఎర్నాకుళం జంక్షన్ (06086): తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఈ నెల 10, 17 తేదీల్లో సోమవారాల్లో అర్ధరాత్రి 12.10 గంటలకు పాట్నాలో బయలుదేరుతుంది. బుధవారం తెల్లవారుజామున 2.40 గంటలకు దువ్వాడ చేరుకుని, 2.42 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 10.45 గంటలకు ఎర్నాకుళం జంక్షన్ చేరుకుంటుంది.


