రైవాడలో విషాదం | - | Sakshi
Sakshi News home page

రైవాడలో విషాదం

Nov 2 2026 1:35 AM | Updated on Nov 2 2026 1:35 AM

తల్లి, కొడుకు, కోడలు ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలే కారణం

ముగ్గురికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

108 వాహనంలో కేజీహెచ్‌కు తరలింపు

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగమణి, చల్లా ఈశ్వరరావు

దేవరాపల్లి: కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. మండలంలోని రైవాడలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు.. రైవాడకు చెందిన చల్లా ఈశ్వరరావు అలియాస్‌ బుజ్జి (43), భార్య నాగమణి(35), తల్లి వరహాలమ్మ(60) ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే తల్లీకొడుకులతో పాటు కోడలి మధ్య తరుచూ గోడవలు జరిగేవి. వీరి మధ్య పలుమార్లు తగాదాలు జరగడంతో చోడవరం, దేవరాపల్లి పోలీస్‌ స్టేషన్లలో సైతం ఫిర్యాదులు చేసుకున్నారు. రెండేళ్ల నుంచి గంధవరంలో తన సోదరుడు పైడిరాజు ఇంటి వద్దే ఉన్న నాగమణిని వారం రోజుల క్రితం అత్త తీసుకువచ్చింది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తల్లీకొడుకు, కోడలి మధ్య మరలా తగాదా జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలను బయటకు పంపించి తలుపులు వేసుకున్నారు. వీరి మధ్య తగాదా పెద్దది కావడంతో ముగ్గురు పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించారని తెలిసింది. ముగ్గురు మంటల్లో చిక్కుకొని బిగ్గరగా కేకలు వేయడంతో పక్కనే నివాసం ఉంటున్న ఈశ్వరరావు అన్నయ్య రాంబాబు, చల్లా నాయుడు తదితరులు తలుపులు పగలుగొట్టారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి రక్షించారు. అనంతరం 108 వాహనంలో కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీస్‌ల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement