జగదాంబ: ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పడూ చూడలేదని గ్రేటర్ విశాఖ మున్సిపల్ వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి అన్నారు. నగరంలో ఆదివారం ఎన్నికల సరళి, జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు వార్డుల్లో పర్యటించారు. జీవీఎంసీ 37వ వార్డుకు వచ్చిన సందర్భంలో అక్కడ ఎన్నికల అధికారిణి ప్రవర్తించిన తీరుపై ఆమె మండిపడ్డారు. మేయర్ అభ్యర్థిగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న తీరుపై కల్యాణి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓ ఎన్నికల అధికారిణి జనసేన కార్యకర్తగా వ్యవహరించారన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద నిబంధనలు ఉల్లంఘించిన జనసేన కార్యకర్తల విషయంలో ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు. ఓటరు స్లిప్పులు ఇస్తూ.. వారు జనసేన పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు చెబుతున్నా అధికారిణి ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు. ఆమైపె ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని తెలిసి కూటమి ప్రభుత్వం ఇలాంటి అధికారులతో కుట్రలు చేయిస్తోందన్నారు. ఎన్నికల్లో కచ్చితంగా మేయర్ అభ్యర్థిగా గెలుపు తమదేనని కల్యాణి అన్నారు. దక్షణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి మాట్లాడుతూ.. పోలీసులు పక్షపాతధోరణి చూపుతున్నారన్నారు. మేయర్ అభ్యర్థి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్తే అడ్డుకోవడ ఏంటని ఆయన ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలన్నారు. పార్టీ అధికార ప్రతినిధి కొండారాజీవ్ మాట్లాడుతూ ఎన్నికల అధికారిణి, పోలీసుల తీరుపై ఎన్నికల ఽఅధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.


