మహారాణిపేట: ప్రసూతి, సీ్త్ర వైద్య రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన చికిత్సా విధానాలపై నిపుణులు సవివరంగా చర్చించారు. విశాఖ ప్రసూతి, సీ్త్ర వైద్య నిపుణుల సంఘం (ఓజీఎస్‌వీ) ఆధ్వర్యంలో జరుగుతున్న 60వ వార్షిక సదస్సు, వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం రెండో రోజు శాసీ్త్రయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ప్రసూతి సమయంలో రక్తంలో ఇన్ఫెక్షన్ (ఆబ్‌స్టెట్రిక్స్ సెప్సిస్)’ అంశంపై డాక్టర్ విద్యాతోభి, డాక్టర్ అచ్యుత్ మీనన్ స్మారక ప్రసంగం చేశారు. ‘గురువు వారసత్వం.. ప్రసూతి, సీ్త్ర వైద్య రంగంలో గతం నుంచి భవిష్యత్తుకు వారధి’ అనే అంశంపై డాక్టర్ టి. రాధ, డాక్టర్ జి.ఆర్.కె. రాజు స్మారక ప్రసంగం అందించారు. సీ్త్ర వైద్య చికిత్సల్లో రోబోటిక్ సాంకేతికత వినియోగంపై డాక్టర్ మంజుల అనగాని కీలకోపన్యాసం చేశారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, ఓజీఎస్‌వీ అధ్యక్షురాలు డాక్టర్ సంధ్యాదేవి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, కార్యదర్శి డాక్టర్ జి.సునందారాణి నాయకత్వంలో సదస్సు జరిగింది. కార్యవర్గ సభ్యులు డాక్టర్ జి.వనజ, డాక్టర్ డి. రేఖ, డాక్టర్ వై. సృజన్ సహకరించారు.


