యలమంచిలి పెద్దపల్లి పోలింగ్ కేంద్రంలో క్యూలో ఓటర్లు
అనకాపల్లి గవరపాలెంలోని అంబేడ్కర్ సామాజిక భవనంలో సాయంత్రం క్యూలో ఓటర్లు
జీవీఎంసీ పంచాయతీ రాజ్ కార్యాలయం ఆవరణలో ఓటు వేసేందుకు వేచి ఉన్న ఓటర్లు
నర్సీపట్నం : ఓటు వేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు
సాక్షి,అనకాపల్లి/అనకాపల్లి టౌన్: జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని ఆరు వార్డుల్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.పట్టణ పరిధిలో ఓటర్లు ఈ ఎన్నికలపై అంతగా ఆసక్త్తి చూపించలేదని చెప్పేందుకు పోలింగ్ జరిగిన తీరు బట్టి చెప్పవచ్చు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 47.18 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. కాగా కడపటి వార్తలు అందే సమయానికి అనకాపల్లి జోన్ పరిధిలో 65.53 శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం.89 పోలింగ్ బూత్‌ల పరిధిలో 76,950 మంది ఓటర్లు ఉండగా 50,425 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనకాపల్లి జోన్ పరిధిలోని ఆదినారాయణ మహి ళా జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రాన్ని,అంబేద్కర్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని,జీవీఎంసీ హైస్కూల్‌లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని,జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద గల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సందర్శించి పోలింగ్ జరిగిన తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు జారీ చేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని,విజయరామరాజుపేట,భీమునిగుమ్మం,గవరపాలెం పార్కు సెంటర్,సంతబయలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. 107,108,109, 110,111,112ల వార్డుల పరిధిలోని వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పన్నీరు మహేశ్వరి, బొడ్డేడ శివ సరోజిని, కె.ఎం లలిత,ఉగ్గిన జ్యోత్స్న,దళాయి నదియా,జాజుల ప్రసన్న లక్ష్మిలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మాజీ ఎంపీ సత్యవతి జీవీఎంసీ ప్రధాన హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద తమ ఓటు హక్కుని వినియోగిచుకున్నారు. జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ 109వ వార్డులోని పోలింగ్ తీరుని పరిశీలించారు.వైఎస్సార్ సీపీ నియోజక వర్గ ఇన్‌ఛార్జ్ మలసాల భరత్‌కుమార్ 110వ వార్డులోని పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలించారు.పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు 110వ వార్డులో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.112వ వార్డులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేత దంతులూరి దిలీప్‌కుమార్,జిల్లా వైఎస్సార్ సీపీ మాజీ అధికార ప్రతినిధి మళ్లబుల్లి బాబు వైఎస్సార్ సీపీ శ్రేణులతో పోలింగ్ కేంద్రాల సందర్శించారు.
మునగపాక/కశింకోట : గవరపాలెం పరిధిలోని 107, 108, 109 వార్డుల్లో సుమారు 60 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. 109లో 1,2 బూత్‌లు అలాగే 110లో 1 నుంచి 16 వరకు పోలింగ్ బూత్‌లు, 111లో 1వ బూత్,112లో 11వ బూత్‌లో పోలింగ్ మందకొడిగా జరిగింది. పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్, జూనియర్ కళాశాల, మహిళా హైస్కూల్, ఉడ్‌పేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలతో పాటు జీవీఎంసీ పంచాయతీరాజ్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, నడవలేని వారు కుటుంబ సభ్యుల సహాయంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత వచ్చిన కొందరిని అనుమతించకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
నర్సీపట్నం : వృద్ధురాలిని ఓటు వేసేందుకు తీసుకువస్తున్న బంధువులు
వీల్‌చైర్‌పై ఓటు వేసేందుకు వస్తున్న వృద్ధురాలు
అనకాపల్లి 110 వార్డు పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ
ఎంపీ సత్యవతి
యలమంచిలి రైల్వేస్టేషన్ రోడ్డు స్కూల్లో ఓటు వేసిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు
మందకొడిగా మొదలై నత్తనడకన పోలింగ్‌పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ సిన్హా
పోలింగ్ తగ్గుదలపై కలవరం
సాక్షి,అనకాపల్లి/అనకాపల్లి టౌన్: జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్ల విషయంలో రాజకీయ పార్టీలో కలవరం మొదలయ్యింది. ఆరు వార్డుల పరిధిలో సుమారు 25 వేలకు పైగా ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. ఇదే సమయంలో ఎన్నికలకు ముందు రోజు దాదాపు అన్ని వార్డుల్లోనూ కూటమి నేతలు ప్రలోభాలకు తెరతీశారు. ఒక్కో ఓటుకి వేయి నుంచి 1500 రూపాయల వరకూ పంపిణీ చేశారు. తగ్గిన పోలింగ్ శాతం తీరుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి,కూటమి నేతల ఆగడాల వల్ల ఓటు వేసేందుకు పట్టణ ప్రజలు 25 వేల మంది వరకూ ముందుకు రాలేదని ప్రచారం ఒక వైపు జోరుగా సాగింది.


