గ్రేటర్‌ మేయర్‌ బరిలో 15 మంది | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ మేయర్‌ బరిలో 15 మంది

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

డాబాగార్డెన్స్‌: గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ నెల 21న నిర్వహించిన ఉపసంహరణలో ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తుది బరిలో 15 మంది అభ్యర్థులు మిగిలారు. వైఎస్సార్‌సీపీ నుంచి వరుదు కల్యాణి, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి దేవర నాగసునందాదేవి, టీడీపీ నుంచి ముక్కా శ్రావణి, బహుజన సమాజ్‌ పార్టీ నుంచి కరణం కీర్తన గ్రేస్‌, భారత చైతన్య యువజన పార్టీ నుంచి నమ్మి భవాని మేయర్‌ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో నిలిచారు.కాంగ్రెస్‌ పార్టీ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన ప్రియాంక దండి పార్టీ నుంచి బీ–ఫాం అందకపోవడంతో ఆమెను స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా నిలిపివేయగా.. అధికారికంగా ఆదివారం జాబితాను ప్రకటించారు.

గుర్తులు ఇలా..

● వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై పోటీ చేస్తున్న వరుదు కల్యాణికి..ఫ్యాన్‌ గుర్తు

● బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కరణం కీర్తనగ్రేస్‌కు ఏనుగు

● భారత జాతీయ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న దేవర నాగ సునందాదేవికి చెయ్యి

● తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ముక్కా శ్రావణికి సైకిల్‌

● భారత చైతన్య యువజన పార్టీ నుంచి పోటీ చేస్తున్న నమ్మి భవానికి బ్యాటరీలైట్‌

జీవీఎంసీ బరిలో 570 మంది

డాబాగార్డెన్స్‌: గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కార్పొరేటర్‌ ఎన్నికల బరిలో 570 మంది అభ్యర్థులు నిలిచారు. 120 వార్డులకు మొత్తం 1,623 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. పరిశీలన అనంతరం ఈ నెల 21న నిర్వహించిన ఉపసంహరణలో 1,053 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తుది బరిలో 570 మంది అభ్యర్థులు మిగిలారు. జోన్‌ల వారీగా చూస్తే తూర్పు జోన్‌ నుంచి 70 మంది, దక్షిణ జోన్‌ నుంచి 77 మంది, ఉత్తర జోన్‌ నుంచి 81 మంది, పశ్చిమ జోన్‌ నుంచి 73 మంది, గాజువాక జోన్‌ నుంచి అత్యధికంగా 140 మంది, అగనంపూడి జోన్‌ నుంచి 28 మంది, అనకాపల్లి జోన్‌ నుంచి 20 మంది, మధురవాడ జోన్‌ నుంచి 27 మంది, భీమిలి నుంచి 19 మంది, పెందుర్తి జోన్‌ నుంచి 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తుది బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు.

యలమంచిలి బరిలో 77 మంది

యలమంచిలి రూరల్‌: యలమంచిలి మున్సిపల్‌ ఎన్నికల బరిలో మొత్తం 77 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం అధికారులు బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటించారు.ప్రత్యక్ష పద్ధతిలో జరగనున్న ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి బొద్దపు తులసి, బీజేపీ నుంచి పిల్లా రమాకుమారి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి దొడ్డి శాంతి బరిలో ఉన్నారు. వార్డులకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నుంచి 32 మంది, టీడీపీ నుంచి 16 మంది,జనసేన నుంచి 15 మంది,బీజేపీ నుంచి ఇద్దరు,కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఐదుగురు, ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. పట్టణంలో 32 వార్డులు, 32,526 మంది ఓటర్లు ఉన్నారు. 63 కేంద్రాల్లో వచ్చే నెల 1వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement