జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి.. | - | Sakshi
Sakshi News home page

జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి..

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

మాడుగుల: మండలంలో ఒమ్మలి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు, పాలిశెట్టి మహేష్‌ కుటుంబం ఆదివారం జాలంపల్లిలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిని మాజీ ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్‌ మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆదేశాలతో పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న కాలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, నాయకులకు ఉజ్వల భవిత ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలు నచ్చడంతో పార్టీలో చేరడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు బొద్దపు భాస్కరరావు, కాత రమణ, బొద్దపు ఆదినారాయణ, బుజ్జి, గొల్లవిల్లి విజయకుమార్‌, గుమ్మాల చంద్రరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement